సీఎం జగన్‌కు కేశినేని మరో ప్రశ్న..!

సీఎం జగన్‌కు కేశినేని మరో ప్రశ్న..!

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై సోషల్ మీడియా వేదికగా ప్రతీరోజూ ఏదో ఒక ప్రశ్న సందిస్తోన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని... తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కావడంపై స్పందించారు. ఓ వైపు సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ చేసిన ఆయన.. "తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ.. జగన్‌ ప్రతిదీ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? లేక ఆంధ్రకు పెండింగ్‌లో ఉన్న ప్రతిదీ సాధిస్తున్నారా? '' అంటూ ప్రశ్నించారు.