బీజేపీ, వైసీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్!

బీజేపీ, వైసీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్!

భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు ఎంపీ నిమ్మల కిష్టప్ప... అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జూన్ 5న ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే ఉపఎన్నికలు రావని తెలిసే మ్యాచ్  ఫిక్స్ చేసుకున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలంతా పార్లమెంట్‌లో పోరు చేశారని... ప్రతిపక్ష పార్టీ మాతో సహకరించి ఉంటే రాష్టానికి మేలు జరిగేదన్నారు నిమ్మల కిష్టప్ప. కేసులు మాఫీ కోసమే బీజేపీతో వైసీపీ నేతలు లాలూచీ పడ్డారని విమర్శించిన ఆయన... ఈ దేశంలో అన్ని పార్టీల రాజీనామాలు ఆమోదించారు...  వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందలేదంటే ఈ రాజకీయం ఏంటో వారే చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు ప్రత్యేక హోదా ప్లకార్డు పెట్టుకుంటారు... మరో వైపు మోడీ కాళ్లు పట్టుకుంటారు... ఇది ఎక్కడి రాజకీయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిమ్మల కిష్టప్ప.