ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు!

ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు!

రాజీనామాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ శివప్రసాద్... హోదా కోసం రాజీనామా చేస్తామని ప్రకటించి 2017 వరకు రాజీనామా చేయక ప్రజలకు చెవ్విలో పువ్వు పెడుతున్నారని అర్థమైందన్న శివప్రసాద్... 2018లో రాజీనామా చేస్తామని ప్రకటించి పార్లమెంట్ సెషన్ ముందుకు కాకుండా ముగిశాక రాజీనామా చేసి మరో పువ్వు పెట్టారని... రాజీనామాల విషయంలో ఆలోచించుకోవాలని స్పీకర్ వారం రోజులు టైం ఇచ్చారంటూ మరో పెద్ద పువ్వు... రూల్స్ ప్రకారం రాజీనామాలు ఇప్పుడు ఆమోదం పొందిన ఇప్పుడు ఉప ఎన్నికలు రావు... ఇదే తెలిసే ప్రజల చెవుల్లో పెద్దపెద్ద పువ్వులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భారతీయ జనతా పార్టీ స్పాన్సర్ చేసే పువ్వులను ప్రజల చెవ్వులో పెడుతూ వైసీపీ ఎంపీలు ప్రజల హృదయాలను గాయపరుస్తున్నారన్నారు ఎంపీ శివప్రసాద్... ప్రధాని నరేంద్ర మోడీ తన పతాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. కట్టుబట్టలతో బయటకు వచ్చిన రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచన లేకుండా... ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డ టీడీపీ ఎంపీ... ప్రధాని మోడీ డైరెక్షన్‌లో వైసీపీ ఎంపీలు నిర్వాకానికి పాల్పడుతున్నారన్నారు. కుట్రలతో ఏపీ అభివృద్ధిని ఆపాలని అనుకుంటున్నారా? అది సాధ్యకాదన్న శివప్రసాద్... సాధారణంగా కాకుండా ఓ దృశ్యరూపకంగా చెబితే వెంటనే అర్థం అవుతుందనే తాను రకరకాల వేషాలు వేసి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని తెలిపారు. చిత్తశుద్ధితో ఉన్న నేతలను ప్రజలు ఆదరిస్తారు... మోసం చేసేవాళ్లను ప్రజలు దూరం పెడతారని స్పష్టం చేశారు ఎంపీ శివప్రసాద్.