పార్లమెంట్‌లో ఆయనది శిఖండి పాత్ర..

పార్లమెంట్‌లో ఆయనది శిఖండి పాత్ర..

పార్లమెంట్‌లో విజయ సాయిరెడ్డిది శిఖండి పాత్ర అని తీవ్రంగా ఆరోపించారు శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... విజయసాయిరెడ్డి కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేక చవకబారు విమర్శలు చేస్తున్నారని విరుచుకు పడ్డారు. కేసుల మాఫీ కోసమే పార్లమెంట్‌లో విజయసాయి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారని.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలపై కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ఒక్క మాట కూడా అనలేని దద్దమ్మలు వైసీపీ నేతలు అంటూ విమర్శలు గుప్పించారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీపై జగన్మోహన్‌రెడ్డి ఇంతవరకు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? అన్నారు. దొంగ లెక్కలు రాయడంలో ఆరితేరిన వైసీపీ నేతలు.. రాష్ట్ర ప్రజల గీతలు ఏ విధంగా మారుస్తారు? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.