బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. గతంలో ప్రధాని మోడీ కేబినెట్ లో తాను పనిచేసినట్లు గుర్తు చేశారు. ఇటీవల ఎన్నికల్లో జాతి అంతా బీజేపీ వైపే ఉందని తేలిందని.. అప్పుడే తామంతా బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నామని తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేసిన తాను మళ్లీ మాతృసంస్థకే వస్తున్నానని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరూ బీజేపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో తామూ ప్రజల వెంటే వెళ్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కూడా భాజపాతో సఖ్యతగా ఉందని టీజీ వెంకటేశ్ అన్నారు.