లాలూను కలిసిన టీడీపీ ఎంపీలు

లాలూను కలిసిన టీడీపీ ఎంపీలు

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. దేశంలోని 18 పార్టీల నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు పలు పార్టీల నేతలను టీడీపీ ఎంపీల బృందాలు కలుస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ  బిహార్‌లో ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవీలతో భేటీ అయ్యారు. కేంద్రంపై పోరాటం చేయనున్న తమకు మద్దతు ఇవ్వాలని ఎంపీలు కోరారు. టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వమని కోరడంతోపాటు చంద్రబాబు రాసిన 8 పేజీల లేఖను వారికి అందజేశారు.