మోడీ అంటే మోసగాడు...

మోడీ అంటే మోసగాడు...

కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కాసేపు డ్రామా నడిచింది... టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రసంగం ముగిసే తరుణంలో మోడీ మోసకారి అంటూ టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు... ముఖ్యంగా ఏది ఏమైనా మోడీ అంటే “మోసకారి ....అబద్దాల పుట్ట” అని వ్యాఖ్యానించారు ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్... దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్... లోక్‌సభ నుంచి ఎంపీ శివప్రసాద్ ను బయటకు పంపాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. మరోవైపు ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని నిర్మలా సీతారామన్ కోరగా... ఆ వ్యాఖ్యలు రికార్డ్ లోకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు స్పీకర్ సుమిత్రా మహాజన్.