తొలి జాబితాకు టీడీపీ పొలిట్‌బ్యూరో ఆమోదం..

తొలి జాబితాకు టీడీపీ పొలిట్‌బ్యూరో ఆమోదం..

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమైంది... ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తొలి జాబితాకు ఆమోదం తెలిపారు. కాసేపట్లో మీడియా సమక్షంలో టీడీపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేయనున్నారు చంద్రబాబు. 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక 10 నుంచి 15 లోక్‌సభ స్థానాల కూడా అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి టీడీపీ వర్గాలు.