28న గుంటూరు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

28న గుంటూరు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

ఈనెల 28న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి రానున్నారు. కార్యాలయంలో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తరువాత పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఎన్నికల ఫలితాలకు ముందే మహానాడు నిర్వహణపై పార్టీలో చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాల హడావుడి కారణంగా జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మహానాడుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది.