చంద్రగిరిలో రీపోలింగ్‌ రగడ

చంద్రగిరిలో రీపోలింగ్‌ రగడ

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రీపోలింగ్‌ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈసీ నిర్ణయానికి నిరసనగా తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ముందు మంత్రి అమరనాథరెడ్డి, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.  పోలింగ్‌ ముగిసిన నెల తర్వాత వైసీపీ ఫిర్యాదు చేస్తే.. రీపోలింగ్‌కు ఈసీ నిర్ణయం తీసుకోవడమేంటని అమరనాథ్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి,  కొత్తకండ్రిగ, కమ్మపల్లి,  వెంకటరామాపురం పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిన్న ఆదేశాలు జారీ చేసింది.