టీడీపీకి లంకా దినకర్ గుడ్ బై..

టీడీపీకి లంకా దినకర్ గుడ్ బై..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ బీజేపీలో చేరారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల దళంలో చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖను అందచేసినట్లు తెలుస్తోంది. దినకర్ బీజేపీలో చేరడంతో టీడీపీ వాయిస్ ను గట్టిగా వినిపించే వారు లేకుండా పోయింది.