ఏపీ పౌరుషం ఏంటో 23న తెలుస్తుంది

ఏపీ పౌరుషం ఏంటో 23న తెలుస్తుంది

ఏపీ పౌరుషం ఏంటో 23న ప్రధాని మోడీ, జగన్‌, కేసీఆర్‌లకు తెలుస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హిట్లర్ పాలనను తలపించిన మోడీకి ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ..మేక్ ఇన్ ఇండియా పెట్టాక ఒక్క కంపెనీ కూడా రాలేదని విమర్శించారు. మహిళలు తనకే ఓటేశారని మోదీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 23 తర్వాత మోడీ హిమాలయాలకు వెళ్లడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. రాజకీయాల్లో నరేంద్రమోడీ, జగన్‌, కేసీఆర్‌లకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని సాదినేని యామిని అన్నారు.