నెలరోజుల్లోనే శాంతి భద్రతలు అదుపుతప్పాయి..

నెలరోజుల్లోనే శాంతి భద్రతలు అదుపుతప్పాయి..

వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అండ చూసుకుని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ లో ఓ వ్యక్తిని దూషించడం పట్ల స్పందించారు. సీఎం వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలను కంట్రోల్ చేయాలని అన్నారు. వైసీపీ దాడులతో ఇప్పటి వరకు ఏడుగురు టీడీపీ కార్యకర్తలు హతమయ్యారని తెలిపారు. హోంమంత్రి సుచరిత ముందుగా తన బాధ్యతలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఏపీని బీహార్ లాగా మార్చాలని సీఎం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.