పుణె టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట.. మయాంక్, కోహ్లీ జోరు..

పుణె టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట.. మయాంక్, కోహ్లీ జోరు..

స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ ఆడుతోన్న టీమిండియా ఇప్పటికే తొలి టెస్ట్‌లో విజయంతో 1-0తో ముందంజలో ఉండగా.. పుణె వేదికగా జరుగుతోన్న రెండో టెస్ట్‌లో ఎలాగైనా విజయం సాధించి టెస్ట్ సిరీస్ తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు.. 1-1తో టెస్ట్ సిరీస్ సమం చేయాలన్న కసితో ఆడుతోంది సౌతాఫ్రికాతో.. దీంతో.. రెండో టెస్ట్ రసవత్తరంగా మారిపోయింది.. రెండో టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది కోహ్లీ సేన. 

తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసిన మయాంక్ అగర్వాల్.. రెండో టెస్ట్‌లోనూ జోరు చూపించాడు.. ఒకే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. మొత్తం 195 బంతులను ఎదుర్కొని.. 16 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేశాడు మయాంక్ అగర్వాల్.. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ 63 పరుగులతో కదం తొక్కాడు.. రోహిత్ శర్మ 14 ఔట్ కాగా.. ఛతేశ్వర పూజారా 58 పరుగులు చేశాడు. ఇక, తొలిరోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 63 పరుగులతో.. అజింకా రాహానే 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.