మళ్ళీ చెలరేగిన రోహిత్.. డబుల్ సెంచరీ..  

మళ్ళీ చెలరేగిన రోహిత్.. డబుల్ సెంచరీ..  

రాంచీ లో ఇండియా.. సౌత్ ఆఫ్రికా జట్లమధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నది.  ఈ టెస్ట్ లో టీమ్ ఇండియా నిలకడగా ఆడుతున్నది.  మొదటిరోజు 224/3 గా ఉన్న ఇండియా జట్టు.. రెండో రోజు ఆటను నిలకడగా ప్రారంభించి ఆ తరువాత దూకుడును పెంచింది.  వైస్ కెప్టెన్ రహానే సెంచరీ పూర్తి చేసిన తరువాత ఔట్ అయ్యాడు.  ఆ తరువాత రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ. వంద, 150 పూర్తి చేసి.. ఆ తరువాత కొద్దగా నెమ్మదిగా ఆడటం మొదలు పెట్టాడు.  

కాగా 199 పరుగులు చేసిన ఆరువాత రోహిత్ శర్మ తనదైన శైలిలో సిక్సర్ కొట్టి డబుల్ సెంచరీ పూర్తిచేశారు.  250 బంతుల్లో 28 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం.   విశాఖలో జరిగిన మొదటి టెస్ట్ లో వరసగా రెండు సెంచరీలు చేసి రికార్ట్ సృష్టించాడు.  మూడో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఏకంగా డబుల్ సెంచరీ చేయడం విశేషం.  ఇక ఇదిలా ఉంటె, గతంలో ఈ హిట్ మ్యాన్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.  మూడుసార్లు డబుల్ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం.