మహిళల టీ20 వరల్డ్ కప్ : బోణీకొట్టిన భారత్

మహిళల టీ20 వరల్డ్ కప్ : బోణీకొట్టిన భారత్


మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘనంగా బోణీకొట్టింది. సిడ్నీవేదికగాజరిగిన తొలిమ్యాచ్‌లో ఆసిస్‌పై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 133 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్.. 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలజట్టుకు.. ఓపెనర్లు స్మృతీ మంధాన, షెఫాలీవర్మలు శుభారంభాన్నిచ్చారు. 11 బంతుల్లో రెండు ఫోర్లతో స్మృతీ పది పరుగులు చేయగా.. షెఫాలీ 15 బంతుల్లో 29 పరుగులు చేసింది. దీంతో నాలుగు ఓవర్లలో భారత్ మహిళా జట్టు 40 పరుగులు చేసింది. ఈ జోరును చూస్తే భారత్ భారీస్కోరు సాధించడం ఖాయమనిపించింది. కానీ ఆసిస్ స్పిన్నర్ జొనస్సెన్ దాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.  జొనస్సెన్ రెండు వికెట్లుతీసి భారత్‌ను దెబ్బతీసింది.

స్వల్ప వ్యవధిలోనే హర్మన్ సేన.. మూడు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన దీప్తిశర్మతో కలిపి జెమీమా రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరు కలిసి నాలుగోవికెట్‌కు అబేధ్యంగా 53 పరుగులు చేశారు.ఆఖర్లో భారత మహిళా బ్యాట్స్‌మెన్ దూకుడు ప్రదర్శించకపోవడం వల్ల భారత్ 132 పరుగులకే పరిమితమైంది. ఆసీస్‌ బౌలర్లలో జోనస్సెన్ రెండు, ఎలిసీ పెర్రీ, డెలిస్సా చెరో వికెట్‌ పడగొట్టారు. 133 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన ఆసిస్‌కు.. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. బెత్‌మూవీ, కీపర్ అలీసా హీలితో కలిసి తొలివికెట్‌కు 32 పరుగులు జోడించింది.

మూవీని,శిఖ పెవిలియన్‌కు పంపినా అలీసా దూకుడు కొనసాగించింది. ఫోర్లు,సిక్సర్లతో అర్థశతకం బాదింది. అలిసా జోరుని చూస్తుంటే మ్యాచ్ ఆసిస్‌దే అనిపించింది.కానీ, పూనమ్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. బంతిని గింగిరాలు తిప్పుతూ ఆసీస్‌ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు చేర్చింది. అయితే పూనమ్‌ హ్యాట్రిక్ సాధించే అవకాశాన్ని మిస్సైంది. పన్నెండో ఓవర్మూడో బంతికి రేచల్‌ హేన్స్‌ , నాలుగో బంతికి ఎలిస్‌ పెర్రీని ఔట్‌ చేసింది.తర్వాతి బంతి జొనస్సెన్‌  బ్యాట్‌కు ఔట్‌ సైడ్‌ఎడ్జ్‌ తీసుకుంది. కాస్త కష్టతరమైన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ తానియా అందుకోలేకపోయింది. మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌ చేరుతున్నా.. గాడ్నర్ పోరాడింది. ఫోర్లు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగించింది.  ఆఖరి ఓవర్‌లో శిఖకు రిట్నర్‌క్యాచ్‌ ఇచ్చి ఔటవ్వడంతో ఆసీస్‌ ఓటమి లాంఛనమైంది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ నాలుగు, శిఖ మూడు, రాజేశ్వరి ఒక వికెట్‌ పడగొట్టారు.