203 పరుగులతో భారత్ ఘనవిజయం

203 పరుగులతో భారత్ ఘనవిజయం

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. నాటింగ్ హామ్ లో జరిగిన మూడో టెస్టు గెలిచి సిరీస్ ఆశలను నిలుపుకొంది. ఐదో రోజు ఆట ప్రారంభం కాగానే అశ్విన్ ఇంగ్లాండ్ తోక చివరి కొసను కత్తిరించాడు. జేమ్స్ ఆండర్సన్ వికెట్ అశ్విన్ తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 317 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 203 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో భారత్ 1-2 తేడాతో నిలిచింది. రెండు ఇన్నింగ్స్ లలో జట్టుకి వెన్నెముకగా నిలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.