విరాట్ సేనకు మళ్ళీ ఫైన్...

విరాట్ సేనకు మళ్ళీ ఫైన్...

సిడ్నీలో భారత్-ఆసీస్ ల మధ్య నిన్న జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియాతో 66 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. అయితే అదే సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. భారత జట్టు నిర్ణిత సమయం కంటే ఒక ఓవర్ ఆలస్యంగా వేసిన కారణంగా ఈ ఫైన్ విధించారు. అయితే విరాట్ కోహ్లీ ఈ తప్పును అంగీకరించాడు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 374 పరుగులు చేయగా భారత్ 308 కే పరిమితమైపోయింది.