విండీస్ పర్యటనకు టీమిండియా జట్లు ఇవే..

విండీస్ పర్యటనకు టీమిండియా జట్లు ఇవే..

వరల్డ్‌కప్‌ తర్వాత మరో సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతోంది. ఆగస్టు 3వ తేదీ నుంచి వెస్టిండీస్‌లో భారత జట్టు పర్యటిస్తోంది. ఈ సిరీస్‌లో 2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20ల్లో విండీస్‌తో భారత్‌ తలపడనుంది. ఈ పర్యటనలో పాల్గొనే టీమిండియా జట్టును సెలెక్టర్లు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. కెప్టెన్‌ కోహ్లీకి, బుమ్రాకి విశ్రాంతినిస్తారని భావించినా.. వారిద్దరినీ రెస్ట్‌ ఇవ్వలేదు సెలెక్టర్లు. మూడు ఫార్మేట్లలోనూ కెప్టెన్‌గా కోహ్లీనే వ్యవహరిస్తాడు. వన్డేలు, టీ20లకు రోహిత్‌ శర్మ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. టెస్టుల్లో వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను రహానెకు ఇచ్చారు. 

టెస్ట్‌ జట్టు..
కోహ్లీ (కెప్టెన్‌), రహానె (వైస్‌ కెప్టెన్‌) మయాంక్‌, రాహుల్‌,  పుజారా, రోహిత్‌ శర్మ, విహారి, పంత్‌, సాహా, అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌, ఇషాంత్‌, షమీ, బుమ్రా, ఉమేశ్‌ 

వన్డే జట్టు..
కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, ధావన్‌, రాహుల్‌, పంత్‌, జడేజా, కుల్‌దీప్‌, చాహల్‌, కేదార్‌ జాదవ్‌, షమీ, భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీ

టీ 20 జట్టు..
కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), ధావన్‌, రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌, కృనాల్‌ పాండ్య, జడేజా, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ