ధోనీని మించినోడు లేడు..!

ధోనీని మించినోడు లేడు..!

ఓవైపు ఎంఎస్ ధోనీపై విమర్శలు పెరగడం.. రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో మిస్టర్ కూల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు బీసీసీఐ మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే. సొంత ప్రయోజనాల కోసం కాకుండా ధోనీ ఎప్పుడూ దేశం కోసమే ఆడాడన్న ఆయన... ధోనీకి తగిన ప్రత్యామ్నాయ ఆటగాడు టీమిండియాలో మరొకరు లేరని స్పష్టం చేశారు. ఒక వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతడితో మరో క్రికెటర్‌ సరితూగలేడని చెప్పారు. ఇక, ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించిన సంజయ్ జగ్దాలే.. ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో ధోనీకి తెలుసన్నారు. రిటైర్మెంట్‌ ప్రకటించేముందు సచిన్‌ను సంప్రదించినట్టు సెలెక్టర్లు ఓసారి ధోనీని కలిసి.. తన మనసులో ఏముందో తెలుసుకోవాలని సూచించారు. మరోవైపు 38 ఏళ్ల వయసులోనూ ధోనీ మునుపటిలా ఆడాలనుకోవడం సరైందికాదన్నారు జగ్దాలే.. తమ కెరీర్‌లో సరిగ్గా ఆడని ఆటగాళ్లు సైతం అతడిపై విమర్శలు చేస్తున్నారని.. ధోనీని విమర్శించేవారిపై సెటైర్లు వేశారు.