లండన్‌లో జెండా ఎగురవేసిన టీమిండియా

లండన్‌లో జెండా ఎగురవేసిన టీమిండియా

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంది. బుధవారం టీమిండియా బస చేస్తున్న తాజ్ లండన్ హోటల్ ప్రాంగణంలో కోచ్ రవి శాస్త్రి భారత జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంతరం ఆటగాళ్లు అందరు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆటగాళ్లందరూ జెండాతో ఫొటోలు దిగి వాటిని తమ అభిమానులతో పంచుకున్నారు. బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది. కోచ్ రవిశాస్త్రి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ వేడుకకు సంబందించిన పోటోలను పంచుకున్నారు.