టీమ్ ఇండియా ఘోర పరాజయం... 

టీమ్ ఇండియా ఘోర పరాజయం... 

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ముంబైలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియాపై ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 255 పరుగులకే అల్ అవుట్ అయ్యింది.  256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు వికెట్ నష్టపోకుండా టార్గెట్ ను ఛేదించడంతో ఆస్ట్రేలియా మ్యాచ్ విజయం సాధించింది.  

డేవిడ్ వార్నర్, ఆరోన్ పించ్ లు భారీ శతకాలు సాధించారు.  వార్నర్ 128 పరుగులు, పించ్ 110 పరుగులు చేశారు. దీంతో మొదటి వన్డే మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓడిపోయింది.