టీమిండియాకు కొత్త జెర్సీలు

టీమిండియాకు కొత్త జెర్సీలు

వెస్టిండీస్ పర్యటనలో టీ-20, వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసి ఇక టెస్ట్ సిరీస్‌కు సిద్ధమైంది టీమిండియా. టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఇదే సమయంలో టీమిండియా జెర్సీలను మార్చేశారు. రేపు వెస్టిండీస్‌తో ప్రారంభంకానున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కొత్త జెర్సీల‌ను ధ‌రించ‌నున్నది. ఇప్పటికే, కొత్త జెర్సీల‌ను ధ‌రించిన కోహ్లీ సేన ఫోటోలు రిలీజ్ చేయగా.. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు టెస్టు క్రికెట్‌కు కొత్త ఉత్తేజం తీసుకువ‌చ్చేందుకు ఐసీసీ టెస్టు చాంపియ‌న్‌షిప్‌ను నిర్వహిస్తున్న సమయంలో.. కొత్త రూల్స్‌తో పాటు టెస్టు క్రికెట్‌ను కొత్త జెర్సీలతో ప్రారంభించనుంది కోహ్లీ సేన. ఇక, టెస్టు క్రికెట్ కోసం స్పెషల్‌గా తయారు చేసించిన ఈ జెర్సీలు వైట్ కలర్‌లోనే ఉండగా.. ఆట‌గాళ్ల పేర్లతో పాటు జెర్సీ నెంబ‌ర్లు కూడా ఉంటాయి. కొత్త జెర్సీలో 18 నంబర్‌తో ఉన్న విరాట్ జెర్సీ ఇప్పుడు వైరల్ అయిపోయింది.