ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు

ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. నిన్న ఇండియా నుండి సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, శిఖర్ ధవన్, అంబటి రాయుడులు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ సమక్షంలో నెట్స్ లో చెమటోడ్చారు. అనంతరం బంగార్ తో ధోనీ ముచ్చటించారు. దీనికి సంబంధించిన పోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. శనివారం ఉదయం మొదటి వన్డే సిడ్నీ వేదికగా జరగనుంది.