డబ్లిన్‌లో భారత జట్టు ప్రాక్టీస్

డబ్లిన్‌లో భారత జట్టు ప్రాక్టీస్

ఐర్లాండ్‌తో జరగబోయే టీ-20 సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఐర్లాండ్‌ డబ్లిన్‌లోని ద విలేజ్ స్టేడియంలో ఐర్లాండ్‌, భారత్ జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు మంగళవారం లండన్‌ నుంచి డబ్లిన్‌ చేరుకున్నారు. అనంతరం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మాజీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, బుమ్రా, పాండ్య, రోహిత్, చాహల్ మరియు మరికొందరు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సిరీస్ లో భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ-20లు ఆడనుంది. బుధవారం తొలి టీ-20 మ్యాచ్, శుక్రవారం రెండవ టీ-20 మ్యాచ్ లు ఉన్నాయి. తొలి టీ-20 మ్యాచ్ ఈ రోజు రాత్రి 8.30 గంటలకు సోని సిక్స్ లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది.