మెల్ బోర్న్ టెస్టులో చెలరేగిన పుజారా

మెల్ బోర్న్ టెస్టులో చెలరేగిన పుజారా

మెల్ బోర్న్  టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 89 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.మిస్టర్ డిపెండబుల్ పుజారా హాఫ్ సెంచరీ చేశాడు. పుజారా టెస్టుల్లో 21వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. పుజారా 68 పరుగులతోను, కోహ్లి 47 పరుగులతోను క్రీజులో ఉన్నారు. వీరిద్దరి జోడి 92 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది.