జైట్లీ మృతి...టీమ్ ఇండియా కీలక నిర్ణయం

జైట్లీ మృతి...టీమ్ ఇండియా కీలక నిర్ణయం


మాజీ బిసిసిఐ ఉపాధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి చెందిన నేపథ్యంలో టీం ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అరుణ్ జైట్లీ మృతికి సంతాపంగా వెస్టిండీస్‌తో ఈరోజు ఆడే మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనున్నారు. అరుణ్ జైట్లీ గతంలో ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ (డీడీసీఏ)కు అధ్యక్షత వహించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన తన సేవలందించారు. అరుణ్ ‌జైట్లీ సేవలను గుర్తు చేసుకుంటూ నేడు వెస్టీండీస్‌తో జరిగే మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్లు ధరించాలని టీం ఇండియా నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ఈ ఆలోచనను ప్రతిపాదించగా, దానికి వెంటనే కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్, సీఈఓ రాహుల్ జోహ్రీ మద్దతు ఇచ్చారని సమాచారం. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ఢీల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు పభుత్వ లాంచనాలతో జరగనున్నాయి.