భారత్‌ను కట్టడి చేసిన కివీస్ బౌలర్లు...

భారత్‌ను కట్టడి చేసిన కివీస్ బౌలర్లు...

భారత్ - న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా 5 టీ20 లు, 3 వన్డేలు, అలాగే 2 టెస్ట్ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. అయితే టీ2౦, వన్డే సిరీస్ లు ముగిసిపోగా.. ఇక మిగిలింది కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే. అయితే ఈ మూడు సిరీస్ మ్యాచ్‌లో సిరీస్‌ను ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ముగియాల్సిందే. ఇక, ఈ సిరీస్‌లో భాగంగా ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ అనుకున్న విధంగానే భారత ఆటగాళ్లను కట్టడి చేసింది. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా(16) పుజారా(11) పరుగులకే పెవిలియన్ కు చేరుకోగా టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ కూడా 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే ఆరంభం బాగానే చేసిన మయాంక్(34)  కూడా క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం బ్యాట్టింగ్ లో ఇండియా వైస్ కెప్టెన్ రహానే(21) అలాగే ప్రాక్టీస్ మ్యాచ్ లో సెంచరీ తో అదరగొట్టిన విహారి(6) పరుగులతో స్కోర్ బోర్డు ను ముందుకు నడిపిస్తున్నారు. భారత్ ఇప్పటివరకు 4 వికెట్ల నష్టానికి గాను 95 పరుగులు చేసింది.