అండర్‌-19 ఫైనల్: టాస్ వాళ్లది.. బ్యాటింగ్‌ మనది..

అండర్‌-19 ఫైనల్: టాస్ వాళ్లది.. బ్యాటింగ్‌ మనది..

ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభమైంది... ఫైనల్‌లో భారత్-బంగ్లాదేశ్ అండర్ 19 జట్లు తలపడుతుండగా.. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ అక్బర్‌ అలీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.. దీంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది... ఇక, సెమీఫైనల్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్టు యువ భారత్‌ సారథి ప్రియం గార్గ్‌ తెలిపాడు. ఓవైపు నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు ఉండగా.. మరోవైపు, వరల్డ్‌కప్‌ టోర్నీలో కనీసం ఫైనల్‌కు కూడా చేరని బంగ్లాదేశ్ జట్టు ఉంది. అంటే, బంగ్లాదేశ్‌ జట్టు ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. భారత్ విజయం సాధిస్తే... ఐదు కప్‌లో కొత్త చరిత్ర సృష్టించనుండగా.. బంగ్లాదేశ్ విజయం సాధించినా అది కొత్త రికార్డుగానే నమోదు కానుంది. ఈ పోరులో హాట్ ఫేవరెట్‌గా భారత్ బరిలోకి దిగుతుండగా.. వర్షం వచ్చే అవకాశం ఉండడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది.