టీమ్ ఇండియా ఘనవిజయం - సీరిస్ కైవసం 

టీమ్ ఇండియా ఘనవిజయం - సీరిస్ కైవసం 

బెంగళూరులో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నది.  మొదటి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో వన్డేలో ఇండియా విజయం సాధించింది.  కాగా, సీరీస్ కు కీలకంగా మారిన మూడో వన్డేలో టీం ఇండియా ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.  స్మిత్ సెంచరీ చేయగా, మార్మస్ హాఫ్ సెంచరీ చేశారు.  287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ 119 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 89 పరుగులు చేశారు.  ఆ తరువాత శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులతో రాణించడంతో టీమ్ ఇండియా విజయం సాధించింది.