న్యూజిలాండ్ కు ఇండియా షాక్ : రెండో టి20లో భారీ విజయం 

న్యూజిలాండ్ కు ఇండియా షాక్ : రెండో టి20లో భారీ విజయం 

న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్ లో టీం ఇండియా జట్టు న్యూజిలాండ్ పై ఘనవిజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.  133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు కేవలం  మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.3 ఓటర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తక్కువ స్కోర్ కే వెనుదిరిగా శ్రేయాస్, రాహుల్ లు నిలకడగా ఆది మూడో వికెట్ కు 86 పరుగులు రాబట్టారు.  న్యూజిలాండ్ బౌలర్లను ధాటిగా ఎదురుకొంటూ వీలు దొరికినప్పుడల్లా బౌండీరీలు కొడుతూ మ్యాచ్ ను గెలిపించారు.  దీంతో టీం ఇండియా 2-0 ఆధిక్యంలో ఉన్నది.  ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలో టీం ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు న్యూజిలాండ్ పై కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది.