సఫారీలతో పోరుకు టీమిండియా సై

సఫారీలతో పోరుకు టీమిండియా సై

వెస్టిండీస్‌ పర్యటనలో వరుసగా అన్ని ఫార్మాట్ల సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. స్వదేశీ గడ్డపై సఫారీలతో పోరుకు సై అంటోంది. భారత్-సౌతాఫ్రికాల మధ్య మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ జరగనుంది. ఈనెల 15న ధర్మశాల వేదికగా తొలిపోరు మొదలుకానుంది. ఇరుజట్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాయి. ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన సఫారీలు.. ఈ సిరీస్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. విండీస్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన కోహ్లీ సేన కూడా... అదే స్థాయిలో రాణించాలని భావిస్తోంది. సౌతాఫ్రికాకు కగిసో రబాడా, డీకాక్‌లాంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణించే అతి కొద్దిమంది పేసర్లలో కగిసో ఒకరు. డుప్లెసిస్ లేకపోవడంతో బ్యాటింగ్‌ బాధ్యత అంతా డీకాక్‌పైనే పడింది. భారత్‌పై క్వింటన్‌కు చక్కటి రికార్డుంది. కోహ్లీ, రోహిత్‌, శిఖర్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు భారత్ బలం కాగా... బౌలింగ్ విభాగంలో సత్తా చాటాలని యువకులు ఉవ్విళ్లూరుతున్నారు.