వరల్డ్‌కప్‌ క్రికెట్ బామ్మ ఇక లేరు

వరల్డ్‌కప్‌ క్రికెట్ బామ్మ ఇక లేరు

వరల్డ్‌కప్‌ సెలబ్రిటీ బామ్మ ఇక లేరు. గతేడాది వరల్డ్‌కప్‌లో టీమిండియా విజయం సాధించకపోయినా.. ఓ భారతీయ అభిమాని మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆమే బామ్మ చారులత పటేల్‌. ఆ వరల్డ్‌కప్‌లో ఆమె చేసి సందడి అంతా ఇంతా కాదు. ఈ బామ్మ ఇప్పుడు మన మధ్య లేరు. అనారోగ్య సమస్యలతో ఆమె కన్నుమూశారు. వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో చారులతా పటేల్‌ చేసిన సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె చూపించిన ఉత్సాహానికి విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఫిదా అయ్యారు. మ్యాచ్‌ తర్వాత ఆమెను కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు. అలా సెలబ్రెటీగా మారి అందరి దృష్టి ఆకర్షించిన బామ్మ అనారోగ్యంతో మరణించడం పట్ల క్రికెట్ అభిమానులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.