నెట్స్ లో శ్రమిస్తున్న భారత ఆటగాళ్లు

నెట్స్ లో శ్రమిస్తున్న భారత ఆటగాళ్లు

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా మంగళవారం భారత్, హంకాంగ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరగుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేసాడు. రోహిత్ తో పాటు సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడులు కూడా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు భారత్, హంకాంగ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ ఉండగా.. బుధవారం సాయంత్రం 5 గంటలకు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ ఉంది.