'చావు కబురు చల్లగా' టీజర్‌ అప్డేట్‌ వచ్చేసింది..

'చావు కబురు చల్లగా' టీజర్‌ అప్డేట్‌ వచ్చేసింది..

'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా పరిచయమైనా యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా నటిస్తూనే నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో ప్రతినాయకుడిగాను నటించాడు. ఈ సినిమాలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం"చావు కబురు చల్లగా". ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను లాక్‌డౌన్‌లోనే విడుదల చేసింది చిత్రయూనిట్.  ఇక ఈ సినిమాలో శవాల స్పెషలిస్ట్ బస్తీ బాలరాజుగా కార్తికేయ నటిస్తున్నాడు. కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీవాసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.  అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ గ్లిప్స్‌ రిలీజ్‌ డేట్‌ను ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ చెప్పేసింది. ఈ టీజర్‌ ఎల్లుండి అంటే ఈ నెల 11న 10:56 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది సినిమా యూనిట్. ఈ టీజర్‌ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.