'సాహో' సత్తా ఏమిటో తేలిపోతుంది

'సాహో' సత్తా ఏమిటో తేలిపోతుంది

ప్రభాస్ హీరోగా 300 కోట్ల భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సాహో'.  ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది ఉంది.  మొదటిరోజు షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర్నుండి సినిమా లా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటూ టీమ్ చెబుతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.  సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరూ ఉత్కంఠగా ఉన్నారు.  వారి కోసమే జూన్ 13న టీజర్ రిలీజ్ చేయనున్నారు.  ఈ టీజర్లో ఉండబోయే కంటెంట్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో, దాని సత్తా ఏమిటో తేలిపోతుంది.  సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.