రవిప్రకాశ్ ఫోర్జరీపై టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి

రవిప్రకాశ్ ఫోర్జరీపై టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి

టీవీ9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్‌ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ను మూడు రోజులు విచారించామని సైబరాబాద్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు వచ్చినప్పుడు ఆయన బయట ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విచారణకు ముందు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి రవిప్రకాశ్ ను విచారిస్తున్నామన్నారు. అలంద మీడియా ఇచ్చిన కేసుపైన అన్ని కోణాల్లో రవి ప్రకాష్‌ను ప్రశ్నించామన్నారు. రవి ప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు తమ వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపారు. నటుడు శివాజీకి కూడా ఈ మధ్యనే నోటీసులు పంపామన్నారు. సోదాల్లో తమకు దొరికిన ఆధారాలు, సాక్షులు చెప్పిన విషయాలు, మూడు రోజులపాటు రవిప్రకాశ్‌ విచారణ సారాంశాన్ని సోమవారం కోర్టుకు నివేదిస్తామన్నారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా ఆయన్ను అరెస్ట్‌ చేయాలా? వద్దా? అనేది తెలుస్తుందని ఏసీపీ స్పష్టం చేశారు.