సాంకేతిక లోపం: నిలిచిన హైదరాబాద్‌ మెట్రో రైలు

సాంకేతిక లోపం: నిలిచిన హైదరాబాద్‌ మెట్రో రైలు

సాంకేతిక లోపంతో హైదరాబాద్‌ మెట్రో రైల్ నిలిచిపోయింది... మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వైపు వెళ్తున్న మెట్రో రైలులో సాంకేతిక లోపంతో తలెత్తడంతో బాలానగర్ అంబేడ్కర్ స్టేషన్‌లో నిలిపివేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడం తోనే మెట్రో రైలు నిలిచిపోయినట్టు సిబ్బంది చెబుతున్నారు. అయితే మెట్రో రైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు. మరోవైపు ఒక మెట్రో రైలు నిలిచిపోవడంతో... ఆ రూట్‌లో మిగతా సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో మొదట నాగోల్ నుంచి మియాపూర్‌ వరకు సర్వీసులను ప్రారంభం కాగా... తాజాగా ఎల్బీనగర్‌ - అమీర్‌పేట్‌ మధ్య మెట్రో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.