తిరుపతి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

తిరుపతి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం

శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు విమానాన్ని నిలిపివేశారు. బయలుదేరే సమయానికి ముందు విమానంలోని రెండు ఇంజన్లలో ఓ ఇంజన్ కు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్లిన ప్రయాణికులు విమానంలోనే అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము 6.55 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తదితరులు ఉన్నట్లు సమాచారం.