కాశ్మీర్ లో గ్రనేడ్ దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

కాశ్మీర్ లో గ్రనేడ్ దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

జమ్మూ బస్ స్టాండ్ లో గురువారం ఉదయం జరిగిన గ్రెనేడ్ పేలుడు కేసును పోలీసులు చేధించారు. గ్రెనేడ్ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దక్షిణ కాశ్మీర్ కుల్గాంకు చెందిన యాసిర్ ఆలియాస్ అర్హాన్ గా గుర్తించినట్లు డీజీపీ దిల్బార్ సింగ్ తెలిపారు. జమ్మూ నుంచి పారిపోతుండగా పట్టుకున్నామని అన్నారు. కేసు విచారణ జరుగుతుందని డీజీపీ పేర్కొన్నారు. అయితే గత 10నెల్లలో ఇలాంటి దాడి జరగడం ఇది మూడోసారి.

ఉదయం జమ్ము బస్టాండ్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 30మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.