ఆరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం 

ఆరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం 

ఆంధ్రప్రదేశ్ లోని తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిపై ఉదయ్ అనే 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈరోజు చోటు చేసుకున్న ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బాలికను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయగూడెంకు చెందిన ఉదయ్  బంధువుల ఊరైన పెద్దేవం గ్రామానికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంధువుల ఇంటికి సమీపంలో ఉన్న మైనర్ బాలికపై యువకడు అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక కుటుంబ సభ్యులు వెంటనే ఆ విషయాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.