లాలూ కుమారుడి శివావతారం...

లాలూ కుమారుడి శివావతారం...

బిహార్‌ మాజీ సీఎం లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు. శివుడి మాదిరిగా నడుముకు పులి చర్మం తరహా వస్త్రాన్ని చుట్టుకుని పట్నాలోని ఆలయంలో ఇవాళ పూజలు చేశారు. మరి కాసేపట్లో దేవ్‌ఘర్‌లోని బాబా బైద్యనాథ ఆలయానికి వెళ్లి అక్కడ శివుడిని తేజ్‌ప్రతాప్‌ దర్శించుకుంటారు. శివుడి వేషధారణలో శివభక్తులతోపాటు ఆలయానికి చేరుకున్న తేజ్‌.. రెండు సార్లు శంఖం పూరించారు. గతంలో కృష్ణుడి వేషధారణతో ఆకట్టుకున్న తేజ్‌.. ఈ మధ్యే ఓ దళితుడి ఇంటికి వెళ్లి అక్కడ స్నానం చేశారు. రెండు రోజుల క్రితం సైకిల్ యాత్ర కూడా చేశారు.