రెండుగా చీలిన రాష్ట్రీయ జనతాదళ్?

రెండుగా చీలిన రాష్ట్రీయ జనతాదళ్?

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నిట్టనిలువునా రెండుగా చీలిపోయేలా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త దుకాణం తెరిచాడు. అతను తన కొత్త కుంపటికి 'లాలూ రబ్రీ మోర్చా' అని పేరు పెట్టుకున్నాడు. రాజధాని పట్నాలో ఏర్పాటు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఆరోపించాడు. తమకు శివ్ హర్, జహానాబాద్ లోక్ సభ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు కూడా తేజ్ ప్రతాప్ యాదవ్ గొంతు మార్చిన దాఖలాలు కనిపించాయి. ఆయన ఆర్జేడీ నుంచి వేరు పడవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

అంతకు ముందు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ విద్యార్థి విభాగం ఇన్ ఛార్జ్ పదవికి రాజీనామా చేశాడు. తేజ్ ప్రతాప్, ఇతర కుటుంబ సభ్యులకు చాలా కాలంగా పొసగడం లేదు. ముందు అతను తన భార్య ఐశ్వర్యారాయ్ కి విడాకులు ఇవ్వాలని అర్జీ దాఖలు చేశాడు. ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నారు.

తేజ్ ప్రతాప్ తన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో 'ఆర్జేడీ విద్యార్థి విభాగం ఇన్ ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాను' అని రాశారు. దీంతో పాటే తేజ్ ప్రతాప్ ఒక కవిత రాసి సూచనప్రాయంగా చాలా విషయాలు చెప్పేశాడు. 'నాదాన్ హై వో లోగ్ జో ముఝే నాదాన్ సమఝ్తే హై. కౌన్ కిత్నే పానీ మే హై, సబ్ ఖబర్ హై ముఝే (నన్ను అమాయకుడని అనుకొనేవాళ్లే అమాయకులు. ఎవరెంత లోతులో ఉన్నారో నాకన్నీ తెలుసు)' అని రాశాడు.