మెగాస్టార్ తో తేజ సినిమా.. ఫిక్స్... 

మెగాస్టార్ తో తేజ సినిమా.. ఫిక్స్... 

తేజ సినిమాలు రియలిస్టిక్ చాలా దగ్గరగా ఉంటాయి.  అందుకే అయన సినిమాలు ఫెయిల్ అయ్యినా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు.  నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి గాడిలో పడినా... ఆ తరువాత చేసిన సీత సినిమా పెద్దగా హిట్ కాలేదు.  ఈ సినిమా తరువాత తేజ ఆర్టికల్ 370 పై సినిమా చేయబోతున్నారు.  

దీనికి సంబంధించిన పాయింట్ ను తేజ ఇప్పటికే మెగాస్టార్ అమితాబ్ కు చెప్పారట.  పాయింట్ నచ్చడంతో ఫుల్ స్కిప్ట్ పై కూర్చున్నాడు తేజ.  త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ ను మెగాస్టార్ అమితాబ్ కు చెప్పబోతున్నారు.  అయన ఒకే అంటే సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లడం పెద్ద విషయం కాదు.  ఇప్పటికే ఆర్టికల్ 370 పై సినిమాలు చేయడానికి బాలీవుడ్ లో కొన్ని సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.  తేజ ఈ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటాడు కాబట్టి తేజ సినిమా ముందుగా సెట్స్ మీదకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.