అందాలు వడ్డించినా  ఈ తెలుగు అమ్మడికి అవకాశాలు కరువే...

అందాలు వడ్డించినా  ఈ తెలుగు అమ్మడికి అవకాశాలు కరువే...

తేజస్వి మదివాడ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. మొదట్లో హీరోయిన్ పక్కన సహాయ నటిగా చేసిన తేజస్వి.. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లి హాట్ బ్యూటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. కానీ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడంలేదు అలాగని కేవలం ఎదురుచూపులతో సరిపెట్టకుండా తన ప్రయత్నాలను ఓ రేంజ్ లో చేస్తూనే ఉంది. ఇటు సినిమాల్లో హోమ్లీ కేరక్టర్స్ లో కనిపించడంతో పాటు.. మరోవైపు బబ్లీగా ఊరించడంలో కూడా ఈ భామకు మంచి ట్యాలెంట్ ఉంది. ఐస్ క్రీమ్ లాంటి సినిమాల్లో అందాలు ఆరబోసిన తర్వాత అలాంటి అవకాశం తేజస్వికి మళ్లీ చిక్కలేదు.ఫోటో షూట్స్ తో తన లేలేత పరువాలను పరిచేస్తూ.. ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ఇంటికే పరిమితమైన తేజస్వి.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఇంట్లో ఉంటూ హాట్ ఫొటో షూట్‌లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఈ ఫొటోలు చూస్తోన్న కుర్రాళ్లు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. తాజాగా తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో మరింత హాట్‌గా ఉంది.  బ్రౌన్ కలర్ సూట్లో కూర్చున్న పోజు ఒకటి తాజాగా పోస్ట్ చేసింది. అంతే ఆ సూట్ లో  ఎద అందాలను ప్రదర్శనకు పెట్టింది. ఆ ఫోజ్ లో తేజస్విని చూసి.న  నెటిజన్ల మతులుపోతున్నాయి