తెలకపల్లి రవి : స్థానిక రభసకు సుప్రీంతోనైనా ముగింపు

తెలకపల్లి రవి : స్థానిక రభసకు సుప్రీంతోనైనా ముగింపు

స్థానిక ఎన్నికలకు సంబంధించి  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుపకోవచ్చని హైకోర్ట్ ధర్మాసనం తీర్పు నిచ్చింది.  అంతకు ముందు సింగిల్‌ జడ్జి కొట్టివేసిన నోటిఫికేషన్‌ ను ప్రధాన న్యాయమూర్తి అరూప్‌ కుమార్‌ గోస్వామితో సహా ధర్మాసనం అనుమతించడం పెద్ద పరిణామమే. అయితే ఈ తీర్పుకు ముందు చేసిన వ్యాఖ్యలలో మాత్రం ధర్మాసనం ఎస్‌ఇసి నిమ్మగడ్డ తీరును కూడా విమర్శించింది. నేనుండగా ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం సిద్ధం కాదని ఆయన అన్నప్పుడు రాజ్యాంగ సంస్థలు సున్నితంగా విషయాలు చక్కపెట్టుకోవాలిగాని రాజకీయ పార్టీలా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించింది. ఇప్పుడు కూడా కోవిడ్‌ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం ఎన్నిక సంఘం సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు జరపాలని సూచించింది. సహజంగానే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి షాక్‌ అనీ, ఎదురు దెబ్బ అనీ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు స్వాగతించాయి. టీడీపీ మరో అడుగు ముందు కేసి న్యాయమూర్తులు మారినా న్యాయం మారదని కూడా వ్యాఖ్యానించింది.  ఎస్‌ఇసి చెప్పిన ప్రకారమైతే ఫిబ్రవరి 5,9,13,17 తేదీలలో నాలుగు దశలుగా ఎన్నికలు జరిగిపోవాలి. హైకోర్టు తీర్పుతో ఆ షెడ్యూల్ వచ్చేసినట్టేనని  కొన్ని కథనాలు విడుదలైనాయి. అయితే  దీనిపై ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ దాఖు చేసింది. ఆ కేసు ముగిస్తే గాని స్థానిక ఎన్నికల పై ఒక స్పష్టత రాదు. తాము ఎన్నికలో ఘన విజయం సాధిస్తాము గాని ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జరామకృష్ణారెడ్డి స్పందించారు.

గతంలో అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో సుప్రీం కోర్టు మూడు రకాలుగా స్పందించే అవకాశముంది. మొదటిది` ఈ పిటిషన్‌ ను తీసుకుని హైకోర్టు తీర్పుపై స్టే విధించడం. రెండు`పిటిషన్‌ను తిరస్కరించి ఎన్నికలు జరపాలని చెప్పడం మూడు`మామూలుగా స్వీకరించి అందరికీ నోటీసులు జారీ చేయడం. అప్పుడు ప్రభుత్వరి కొంత వ్యవధి తీసుకోవడానికి అవకాశం కలగొచ్చు. ఏదో విధంగా  ప్రభుత్వం స్థానిక ఎన్నికకు ప్రతిష్టంభన సృష్టించి నిమ్మగడ్డ పదవీ కలం ముగిసే వరకూ సాగదీస్తుందనే అభిప్రాయం టిడిపి తరపున గట్టిగా మాట్లాడే ఒక న్యాయ నిపుణుడే ఈరోజు వెలిబుచ్చారు. అది సాధ్యమా కాదా అనేది  సుప్రీం కోర్టు వైఖరిని బట్టి తేలిపోతుంది. మామూలుగా ఎన్నిక నోటిఫికేషన్‌ ఒకసారి విడుదలైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలన్నది ఒక సూత్రం. ఇటీవల కేరళ ప్రభుత్వం వాయిదా కోరుతూ వెళ్లినపుడు కూడా సుప్రీం అదే చెప్పింది. అయితే ఇక్కడ గత నోటిఫికేషన్‌ వుందా లేదా  కొత్తది విడుదలై అములోకి వచ్చిందా లేదా అనేదానిపైనా వాదనలున్నాయి. అసలు  ఏక పక్షంగా కొత్త నోటిఫికేషన్‌ ఎలా విడుద చేస్తారని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. 21వ తేదీనే సుప్రీం కోర్టు నుంచి ఏ స్పందన రాకపోతే 23నుంచి ప్రక్రియ మొదవుతుందనేది ఒక అంచనా. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ అమవుతోందని నిమ్మగడ్డ చెప్పారు. అయితే ఆయన అనుకుంటే సరిపోదనీ, కోడ్‌ ఏదీ అమలులో లేదని మంత్రి పేర్ని నానీ స్పష్టంగా చెప్పారు. ఉద్యోగుల సంఘాలు కూడా వ్యతిరేకించాయి. కొందరు కీలక అధికారులపై వేటు వేసిన ఎస్‌ఇసి సిబ్బందితో సంభాషణలు జరిపారు. దీనంతలికీ తెర దించుతూ ఎన్నికలు జరగాలంటే ప్రభుత్వం ఎస్‌ఇసి కూడా సమన్వయంతో మెగాల్సిందే. ఏదో విధంగా ఎన్నికలు జరగాల్సిందే గనక దేశంలో చాలా చోట్ల జరిగాలి గనక ముగించడమే మంచిది. అవసరం కూడా.