తెలకపల్లి రవి.. విధ్వంసాలపై పీవీ వ్యూహం చేపట్టిన జగన్‌

తెలకపల్లి రవి.. విధ్వంసాలపై పీవీ వ్యూహం చేపట్టిన జగన్‌

వైసీపీ టీడీపీ నాయకులు కూడా మా దారికి రావసి వచ్చిందని ఈ రోజు మాతో టీవీ చర్చలో పాల్గొన్న బిజెపి నేత రఘునాథబాబు గర్వంగా ప్రకటించారు. నిజంగానే చంద్రబాబు నాయుడు చంద్రస్వామిలా మాట్లాడడం, విజయసాయి రెడ్డి జై శ్రీరాం అంటూ రామతీర్థంలో బోడికొండ ఎక్కడం చూస్తుంటే బిజెపి పాచిక పారినట్టే వుంది. వారిని మించి మత భాషణం చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురించి చెప్పనవసరం లేదు. అయితే వీటన్నింటినీ మించిన విశేషం మాజీ ప్రధాని పివి నరసింహారావు మాటలు ముఖ్యమంత్రి జగన్‌ ఆచరణలో పెట్టడం. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన ఆగష్టు 15 ప్రసంగంలో పివి మాట్లాడుతూ మేము విధ్వంసానికి పునర్నిర్మాణంతో బదులిస్తామని అన్నారు. శుక్రవారం నాడు విజయవాడలో వరుస ఆలయాల పునర్నిర్మాణం, దుర్గ గుడి పనుల శంకుస్థాపన చేయడంలో జగన్‌ అదే వ్యూహం అనుసరించారని చెప్పాలి. రాజకీయంగా బిజెపిని సూటిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని వైసీపీ ప్రభుత్వం ఈ నిర్మాణాలను తన వ్యూహంగా ఎంచుకుందని అందరికీ తెలుసు. పైగా ఇవి తెలుగుదేశం బిజెపి ప్రభుత్వం వుండగా, బిజెపి మంత్రి దేవాదాయ శాఖ చూస్తున్నప్పుడు కూల్చివేయబడ్డాయి గనక ఇరకాటంలో పెట్టడానికి పనికివస్తాయని కూడా జగన్‌ బృందం ఆలోచన కావచ్చు. అందుకే టిడిపి అనుకూల వర్గాలు, మీడియా కూడా ఇవి హడావుడి తతంగమని తీసిపారేసేందుకు ప్రయత్నించడానికి కారణమదే.
           వందకు పైగా ఆయాలలో విధ్వంసాలు, దాడులు జరిగిన తర్వాత ప్రభుత్వం ఆస్యంగానైనా విరుగుడు గురించి ఆలోచించడం అనివార్యమైంది. బిజెపిజోలికి పోకుండా ఇదంతా టిడిపి కుట్ర అని వైసీపీ నేతలు స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఆరోపణలు గుప్పించారు. అదేనిజమైతే పట్టుకోవసిన బాధ్యత మీదే కదా అన్న ప్రశ్న ఎదుర్కొన్నారు. చంద్రబాబు.. సిఎం. హోం మంత్రి, డిజిపిపై మత ముద్ర వేయడాన్ని ఖండించిన వారు కూడా దోషులను పట్టుకోవడంలో అలసత్వాన్ని ఆలస్యాన్ని విమర్శించారు. టాస్క్‌ఫోర్స్‌ లేదా సిట్‌ వేయాలని కోరారు. ఎట్టకేలకు ప్రభుత్వం సిట్‌ వేసి ఈ కేసు దర్యాప్తును సిఐడి నుంచి దానికి బదలాయించింది, సిబిఐకి ఇవ్వానే  ఒత్తిడి వున్నా అంతర్వేది విషయమే ఇంకా తేల్చలేదు గనక ఆ వాదన నిలవలేదు. దర్యాప్తులో చాలా విషయాలు తెలిశాయంటున్నా  బయిటపెట్టడం లేదు. అన్ని చోట్ల విద్యుత్‌రంపం వాడటం బట్టి కుట్ర అర్థమవుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అరెస్టులు కూడా జరిగాయంటున్నారు. లేనిపోని వివాదాలు, ఉద్రిక్తతలు సమసిపోవాంటే ఆధారాలు బయిటపెట్టడం, దోషులను వెల్లడించడం త్వరగా పూర్తి కావాలి. అంతేగాని బిజెపిని మించి పోయేలా మూడు ప్రాంతీయ పార్టీలూ మతతత్వ భాషణకు పాల్పడటం అనర్థదాయకం. మొదట్లో అన్నట్టు మా దారికి అందరూ వచ్చారని ఆ పార్టీ నేతలు గొప్పులు చెప్పుకోవడమే గాక  దాడి పెంచడానికి ఇది కారణమవుతున్నది. బైబిల్‌ పార్టీ కావాలో భగవద్గీత కావాలో తేల్చుకోవాని తెంగాణ బిజెపి అద్యక్షుడు బండిసంజయ్‌ అనడం అందరూ ఖండించారు.. కానీ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, ఢిల్లీ నుంచి జీవీఎల్‌ నరసింహారావు తదితరుల వీరంగం తక్కువగా లేదు. ఈ సమయంలో మత సామరస్య కమిటీలు వేశారు గాని వాటిలో అధికారులు మత పెద్దు మాత్రమే వుండటం వల్ల ఎంత ప్రయోజనమో చూడాల్సిందే.