తెలకపల్లి రవి విశ్లేషణ: రజనీ రాజకీయ వేషం ముగిసిందా?
‘‘ ఎట్టకేలకు కట్టకడపటికి దక్షిణ భారత సూపర్ డూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు.కాని బొమ్మ పడాలంటే ఈ ఏడాది చివరి దాకా ఆగాల్సిందే.’’‘‘ఇంకా పూర్తి వివరాలు చెప్పి ఆచరణలోకి దిగేంతవరకూ వేచిచూడవసిందే. ఆరోగ్యం బాగాలేదన్న మాట ఒకటి వుంది.’’ కొనసాగిన వూగిసలాట ముగించి రజనీకాంత్ ఒక నిర్ణయం ప్రకటించిన సందర్భంగా ఈ డిసెంబర్2న ఎన్టివి తెలుగులో ఈవ్యాస రచయిత చేసిన వ్య్ఖాఖ్యలివి. అయితే ఆయన దానికీ కట్టుబడి వుండకుండా మళ్లీ వెనక్కు తగ్గారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి బిపి పెరిగి ఆస్పత్రిలో చేరిన రజనీ విషయంలో ఆందోళన పడవలసిందేమీ లేదని వైద్యులు ప్రకటించారు, కాని జనంలో సందేహం మొదలైపోయింది. ఆయన కుమార్తెలు రాజకీయాలు వద్దని వారించారని కథనాలు విడుదయ్యాయి. ఈ అనారోగ్యం దేవుడు చేసిన హెచ్చరిక వంటిదంటూ సూపర్‌స్టార్ నమస్కారం పెట్టేశారు. ఇంతవరకూ వచ్చి విరమించడం ప్రజలకు మింగుడు పడదనీ అభిమానులు జీర్ణించుకోలేరని తెలుసు గనకే మూడు పేజీ లేఖ విడుదచేశారు.
భాషా సినిమాలో రజనీకాంత్ నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటుంటాడు గాని నిజ జీవితంలో వందసార్లు చెప్పినా నిర్ణయానికి రాలేకపోయారని నేను తరచూ అంటుండేవాణ్ని. 1996 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు రజనీ చేసిన ప్రకటన జయలలిత పార్టీ నాలుగు స్థానాలకు పడిపోవడానికి కారణమైందని ఒక అభిప్రాయం బలంగా ఏర్పడిరది. ‘‘ఈ సారి జయలిత మళ్లీ గెలిస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు’’ అన్న ఆయన మాటలతో అభిమానులు ప్రేక్షకులు డిఎంకెకు బారీగా ఓటేశారని పరిశీకులు భావించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలోకి వస్తారని వూహలు వున్నాయి. ఈ లోగా చిరంజీవి పవన్ కళ్యాణ్‌తో కమల్‌హాసన్‌తో సహా చాలా మంది రాజకీయాలో ప్రవేశించడం రకరకాల అనుభవాలు అపజయాలు పొందడం జరిగిపోయింది. కేంద్రంలో మోడీ విజయం, జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ రాజకీయ కదలికలు పెరిగాయి. ప్రధాని మోడీ, హొం మంత్రి అమిత్‌షాలు ఆయనతో సాన్నిహిత్యం పాటిస్తూ వస్తున్నారు, రజనీ మక్కల్ మండ్రం పేరిట వెసిన అభిమాన సంఘాలతో రెండు మూడేళ్లుగా సంప్రదింపు జరుపుతూ వూహాగానాలకు వూపిరిపోశారు. తను మొత్తం పరిపాలన మార్చేస్తానని, ముఖ్యమంత్రిని కాబోనని కూడా ప్రకటించారు. ఆధ్యాత్మిక రాజకీయం చేస్తానన్నారు.బిజెపి సిద్ధాంతకర్తలైన గురుమూర్తి వంటివారు రజనీని ఎప్పటికప్పుడు కలుస్తూ సలహాలు ఇస్తూ వుండటమే గాక స్వయంగా మోడీ,అమిత్‌షాలు కూడా తనతో సాన్నిహిత్యం పాటించడం బట్టి ఆ పార్టీ ప్రోద్బలం వుందని చాలామంది భావించారు. తొలి ప్రాంతీయపార్టీ ముఖ్యమంత్రి అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె దాని నుంచి చీలిపోయి మొదట ఎంజీఆర్ తర్వాత జయలలిత నాయకత్వంలోనడుస్తున్న అన్నా డిఎంకెలే తమిళరాజకీయాలను శాసిస్తున్నాయి.జయలలిత హయాంలో ద్రవిడ భావజాం తగ్గుముకం పట్టిన మాట నిజం, రజనీకి సమకాలీకుడు కమల్వహాసన్ మక్కల్నీతిమగం పార్టీని స్తాపించి కొంతవరకూ బిజెపి పట్ల విమర్శనాత్మక వైఖరి తీసుకున్నారు.మరోవైపున బిజెపి అన్నాడీఎంకేతో పొత్తువైపు అడుగు వేసింది.హోంమంత్రి అమిత్‌షా పర్యటన తర్వాత ముఖ్యమంత్రి ఫళనిస్వామి బిజెపితో పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. కాని కొద్దివారాల తర్వాత పాలకపార్టీ ఫళనిస్వామి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అనీ,మరే జాతీయ ప్రాంతీయ పార్టీలు పొత్తుకోసం వస్తాయో లేదో వాటి ఇష్టమనీ అన్నా డిఎంకె నేతలు బింకంగా మాట్లాడారు. మన్నార్గుడి మాఫియాగా పేరొందిన శశికళ జైలు నుంచి రాబోతున్నారు.రజనీకాంత్ శశికళ మధ్యనే పోటీ అని సుబ్రహ్మణ్యస్వామి ప్రవచించారు కూడా. కరుణానిధి మరణంతో మొదటిసారి పూర్తి నిర్ణయాధికారం చేతికొచ్చిన స్టాలిన్ డిఎంకెను ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాని వ్యూహాలు పన్నుతున్నారు.ఈ పరిస్థితులో రజనీ పెట్టే కొత్త పార్టీకి పెద్ద అవకాశం వుండబోదని పరిశీకులు భావించారు. ఆయన అసాధారణ ఆకర్షణ వీటన్నిటినీ అధిగమిస్తుందని కొందరు జోస్యాలు చెప్పినా తనే నమ్మలేకపోయారన్నమాట.
కేవలం ఆరోగ్యం బాగాలేదు గనకే రజనీ వెనక్కు తగ్గారని ఎవరూ అనుకోవడం లేదు.తన రాజకీయ గమనంలో ఇదే చివరి వాక్యం అనుకోవడానికి కూడా లేదు. ఇప్పటి వరకూ చెప్పాంటే కోట్లమంది అభిమానానికి పాత్రులైన రజనీకాంత్ వంటివారు ఒక నిర్ణయం తీసుకోకముందే ఇంత హడావుడి చేయడం బాధ్యతా రాహిత్యం కాదా? తెలుగు కన్నడ మళయాల హిందీ తదితర భాషల్లో చాలా మంది నటులు తమ సినిమాకర్షణ పెంచుకోవడానికి లేదా నిలబెట్టుకోవడానికి రాజకీయ వేషాలు కూడా అవసరమని భావిస్తున్నారా? ఇంతకూ ఈ రాజకీయ భాషావేషం ముగిసినట్టేనా? బిజెపితో సహా మరెవరినైనా ఆశీర్వదించి మద్దతునిచ్చే అవకాశం తోసిపుచ్చలేము.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)