తెలకపల్లి రవి : విశాఖ ఉక్కు రక్షణకై మార్చి 5 బంద్‌, జీవీఎల్‌ అవాకులపై ఆగ్రహం

తెలకపల్లి రవి : విశాఖ ఉక్కు రక్షణకై మార్చి 5 బంద్‌, జీవీఎల్‌ అవాకులపై ఆగ్రహం

ఆంధ్ర ప్రదేశ్థ్‌కు ఆయువు పట్టులాటి  విశాఖ ఉక్కు ను నూరుశాతం తెగనమ్మాలని నిర్ణయించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల ఆత్మగౌరవం పైన,ఆర్థిక అస్తిత్వం పై వేటు వేసింది. దాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న సమైక్య పోరాటంపై నిందా ప్రచారాలుతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మరింత దారుణంగా దాడి చేస్తున్నది. ప్రత్యేక హోదా, లోటు భర్తీ, వెనుక బడిన ప్రాంతాల తోడ్పాటుతో సహా విభజన విషయంలో చేసిన వాగ్దానాన్ని వమ్ము చేసిన  బిజెపి  నాయకులు ఇప్పుడు ప్రాణార్పణతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా హరించే నిర్ణయం తీసుకోవడం వివక్షకు వికృత ఉదాహరణ. ఈ నిర్ణయంపై  ప్రజలో ఆగ్రహావేదనను చూసి  మేము వ్యతిరేకమే మా వాళ్లకు చెబుతామని ఢిల్లీ యాత్రలు చేసి కబుర్లు చెప్పారు. మొదట  ఇది దేశమంతటికీ వర్తించే విధాన నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, మాజీ మంత్రి సుజనాచౌదరి వంటివారు బాహాటంగా సమర్థించారు. ఎంఎల్‌సి మాధవ్‌ వంటి వారు  ఫ్యాక్టరీ ఎక్కడకీ పోదని హాస్యాస్పదమైన వాదనలు చేశారు.

జనసేన అధినేత  పవన్‌కళ్యాణ్‌ ఢల్లీి లో హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసి మన చేతిలో ఏముందని  సరిపెట్టారు .అయితే ఇలాంటి పైపై మాటలతో ప్రజలను మాయజేయలేమని తేలిపోయాక  బిజెపి నేతలు ప్లేటు మార్చేశారు. ‘గజం మిథ్య పలాయనం మిథ్య’ తరహాలో అసలు విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ఎక్కడ చెప్పిందని సోము వీర్రాజు, జివిఎల్‌ వంటి వారు ఎదురు దాడి ప్రారంభించారు. ఇదంతా తమ హిందుత్వను దెబ్బ తీయడానికి రాజకీయ పక్షాలు ఆడుతున్న నాటకమని తిట్టిపోస్తున్నారు.  విశాఖ పక్కనే రామతీర్థంలో ఆలయంపై దాడి జరిగినప్పుడు  పరుగు తీసిన బిజెపి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దెబ్బతీయడానికి  ఆ మంత్రాన్ని ఉపయోగించాలని చూడటం దాని మతతత్వ రాజకీయానికి  పరాకాష్ట.  బిజెపి  విశాఖ ఉక్కు రక్షణ ఉద్యమంపై విషప్రచారం విద్వేష వ్యాఖ్యలకు దిగింది. పరిరక్షణలో పాలుపంచుకోకపోగా అందుకోసం సాగే పోరాటంపై అసత్యాలతో పెద్ద పత్రమే ప్రచురించారు.

ఉక్కు  అమ్మకం పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదని చెప్పడం కన్నా అబద్ధం మరొకటి లేదు.  ఆ వివరాలు వాణిజ్య పారిశ్రామిక పత్రికన్నిటిలో వచ్చాయి కూడా. ‘‘ ఆర్థిక వ్యవహారా క్యాబినెట్‌ కమిటీ (సిసిఇఎ) రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో కేంద్రం వాటా వందశాతం ఉపసంహరణకు విధానపరమైన నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో నడుస్తున్న ఆ సంస్థ నుంచి  వంద శాతం  వాటాను అమ్మేసేందుకు   కేంద్రం తీసుకున్న తుది నిర్ణయం మీ కల్పిస్తుంది. వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయడంతో పాటు యాజమాన్యాన్ని కూడా ప్రైవేటీకరించాని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత శాఖ డీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంతి పాండే ఫిబ్రవరి 3న అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక్కడ ఇంకో విపరీత మేమంటే ఇప్పటి వరకూ పెట్టుబడుల ఉపసంహరణ అన్న పదం వాడుతున్న కేంద్రం ఏకంగా ప్రైవేటీకరణ అనే మాటను తాజా  బడ్జెట్‌తో ముందుకు తెచ్చింది. ప్రధాని మోడీ  ప్రైవేటీకరణకు రాష్ట్రాలను సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రులతో జరిపిన  సమావేశమే మరింత స్పష్టంగా వారి ఉద్దేశాలను బహిర్గతం చేసింది, 

దేశంలో దాదాపు 248 ప్రభుత్వ సంస్థలను తెగ నమ్మడమే విధానంగా ప్రతిరోజూ ప్రకటనలు వస్తుంటే బంగారు బాతు వంటి విశాఖ ఉక్కు ఆ జాబితాలో లేకుండా పోతుందా? ఆ మేరకు ఒక కేంద్ర నాయకుడైనా భరోసా ఇవ్వగలరా? మంగళవారం నాడు కూడా జీవీఎల్‌ వంటివారు వచ్చి విశాఖ  పై రాజకీయ పార్టీలు  ఎన్నికల రాజకీయం చేస్తున్నాయని తిట్టిపోశారు. ప్రైవేటీకరణ జాబితాలో విశాఖ ఉక్కు 35 వ స్థానంలో ఉందన్నారు. అదప్పుడే అమ్మకానికి  రాదని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి చైర్మన్‌  సిహెచ్‌ నరసింహరావు మండిపడ్డారు. ఏ వివరాల పైనైనా చర్చకు సిద్దంగా వున్నామని ప్రకటించారు.  వామపక్షాల ఆధ్వర్యంలో మార్చి 5న ఈ సమస్యపై బంద్‌ తపెట్టారు. దేశంలో ఇలాటి బంద్‌ ఇదే ప్రధమం కావచ్చు. రాజకీయ పార్టీు ఈ బంద్‌ ను బలపర్చడమే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకువెళ్లడం ద్వారా ఉక్కును కాపాడుకోవడానికి  మీ ఏర్పడుతుంది. ముఖ్యంగా రెండు పెద్ద పార్టీలైన వైసీపీ టీడీపీ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఈ సమస్యపై  ఏ మేరకు పాల్గొంటాయో కూడా చూడొచ్చు. బిజెపి ఇలాంటి సమయంలో  ఉద్యమం పై దాడి చేసినట్టయితే ప్రజలు క్షమించడం జరిగే పని కాదు.

 

అంతర్గత విలువ కమిటీ విశాఖ ఉక్కు ప్లాంటుకు రూ.4890 కోట్లు అంచనా కట్టింది. వాస్తవానికి 22 వేల ఎకరా భూమి తో కసి దాని మివ రెండున్నర క్ష కోట్లకు పైనే ఉంటుంది. అప్పుడే దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం ‘పోస్కో’ ప్రతినిధులు 2018లో పర్యటించడం, 1700 ఎకరాల భూమి వారికి కేటాయించి అధునాతన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కై 2019లో  అవగాహనా ఒప్పందం ఎంవోయు కుదిరాయి. ఆ సమయంలో వారు ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు కూడా. ఈ కాలమంతటా దేశంలో రాష్ట్రంలో భిన్న పార్టీలు అధికారం చేస్తున్నా ప్రైవేటీకరణ దిశగా అడుగులు ఆగింది లేదు. వారెవరూ వాటిపై పోరాడలేదు సరికదా ప్రజలతో ఆ సమాచారం పంచుకుని చైతన్యపరిచింది కూడా లేదు. ప్రస్తుతానికి వస్తే 2019లో నరేంద్ర మోదీ రెండోసారి విజయం సాధించాక ప్రైవేటీకరణ జ్వరం బాగా పెరిగింది. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ఆ ప్రతిపాదను లెక్కకు మిక్కుటంగా వున్నాయి. సంస్థలు మాత్రమే గాక కేంద్రం అధీనంలోని భూములను కూడా మివ కట్టి అస్మదీయులకు కట్టబెట్టే ఆర్థిక నీతి అమలవుతున్నది. ఈ వేటు విశాఖ ఉక్కుపైనా పడింది. వంద శాతం ప్రైవేటీకరణ జాబితాలో చేరింది. ఈ వార్త వచ్చాక కార్మిక సంఘాలు పోరాటం ఉధృతం చేశాయి.  

 

బిజెపి దుర్నీతి పై పోరాటం

విశాఖ ఉక్కు విషయమై పార్టీ ఒక విధానం తీసుకుంటుందని, అప్పటి వరకూ ఎవరూ మాట్లాడవద్దని వైసీపీ, జగన్‌ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతిపాదనలతో లేఖ రాశారు. అందులో. ప్రత్యేకంగా గనుల కేటాయించడం, బ్యాంకు రుణాలు ఈక్విటీ గా  మార్చడం, వంటి సూచనలు చేశారు.  ఏడు వేల ఎకరాల భూమిని అమ్మి ఆ మొత్తం అప్పులకు  కట్టవచ్చని కూడా విశాఖ పర్యటన సమయంలో కలిసిన కార్మిక నాయకులు సూచించారు. ‘పోస్కో’ ప్రతినిధులు తనను కలిసిన మాట నిజమే గాని వారికి విశాఖ ఉక్కు పై ఆసక్తి లేదని బాపనపాడు కడప కృష్ణపట్నం వంటి విషయాలు మాట్లాడారని తెలిపారు. ఆ పార్టీ ఎం.పి విజయసాయి రెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ వంటి వారు పాదయాత్రలు చేశారు. టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాస్‌ ఆరు రోజు నిరాహారదీక్ష తర్వాత ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆయనను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు కార్మికుల శిబిరాన్ని సందర్శించి ఐక్య పోరాటంలో  తాము కలిసి రావడానికి సిద్ధమని ప్రకటించారు.

అయితే  రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ విశాఖ ఉక్కుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి దాడి చేయడం అందరికీ తీవ్రాగ్రహం కలిగించింది. శుక్రవారం నాడు విశాఖలో  కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన  గొప్ప సభలో  బిజెపియేతర పార్టీలన్నీ చేతులు కలిపి పోరాటానికి మద్దతు ప్రకటించడంతో బిజెపి దుర్నీతికి దుష్ప్రచారాలకు గట్టి సమాధానం. ఈ ఐక్య పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విశాఖ ఉక్కును ప్రైవేటు పాలవకుండా కాపాడుకోవాలని కార్మికలోకం రాష్ట్ర ప్రజానీకం కృత నిశ్చయంతో వుండటం అభినందనీయం.

రాష్ట్రంలో పెద్ద పార్టీలైన వైసిపి, టిడిపితో సహా అందరూ  రాజకీయ భేదాలకు అతీతంగా రాష్ట్ర మనుగడకు సంబంధించిన ఈ అంశంపై   ఉద్యమాన్ని బలోపేతం చేసి  బిజెపి కపట నాటకానికి స్వస్తి చెప్పాలి. పదేపదే  ఏపీ పట్ల వివక్షకు వికృత ప్రచారాలకు  ప్పాడుతున్న  మోదీ సర్కారుకు మర్చిపోలేని పాఠం నేర్పించాలి. రాష్ట్ర వ్యాపితంగా సాగుతున్న ఈ పోరాటం భవిష్యత్‌ రాజకీయాలును చాలా ప్రభావితం చేస్తుంది. మతతత్వ రాజకీయాలు ఎపిలో చెల్లుబాటు కావని చాటిచెప్పిన మనుగడ కోసం నడుం బిగించాల్సిన సందర్భం ఇది.  రాష్ట్రం కోసం విశాఖ ఉక్కు రక్షణ కోసం  మొదలైన ఈ  సమిష్టి పోరాటం   రేపు మిగిలిన న్యాయమైన హక్కు సాధనకు బాట వేయానేది  ప్రజలందరి ఆకాంక్ష.