తెలకపల్లి రవి విశ్లేషణ:  కోర్టు విచారణ ప్రత్య్రక్ష ప్రసారం:సుప్రీంపరిశీలన

తెలకపల్లి రవి విశ్లేషణ:  కోర్టు విచారణ ప్రత్య్రక్ష ప్రసారం:సుప్రీంపరిశీలన

న్యాయ నిపుణలు  చాలా కాలంగా ముందుకు తెస్తున్న    బహిరంగ  న్యాయ విచారణ  ప్రత్యక్ష ప్రసార పద్దతి  నిన్న సుప్రీం కోర్టులో  వివరంగానే చర్చకు వచ్చింది. స్వయంగా  ప్రధాన న్యాయమూర్తి  ఎస్‌ఎ బాబ్డే ఈ విషయమై వ్యాఖ్యలు చేయడం  ఆసక్తి పెంచింది. ఈ విధానం దుర్వినియోగం కావచ్చుననే సందేహం వెలిబుచ్చుతూనూ బాబ్డే దీనిపై ఒక  నిర్నయం తీసుకోవసిందేనని అంగీకరించారు.

      న్యాయవిచారణ ప్రక్రియ బహిరంగంగా జరపాలనే  ఒక అభిప్రాయం చాలా కాలంగా వున్నా  కరోనా దాన్నివేగవంతంచేసింది.ఆన్‌లైన్‌ విచారణలు వచ్చిన తర్వాత యూట్యూబ్‌లో అదిచూసేఅవకాశం  వచ్చింది.అయితే కక్షిదారులు  సంబంధిత న్యాయవాదులకు మాత్రమే దాన్ని ఇప్పుడు పరిమితం చేస్తున్నారు.జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ఆద్వర్యంలో డిజిటైజేషన్‌ కోసం చర్యలు నిర్ణయించిన సందర్భంలోనూ ఇది ప్రస్తావనకు వచ్చింది. వాస్తవంలో ఆయన గతంలోనే ఆన్‌లైన్‌ విచారణ అందరూ చూసేలా వుండాని అభిప్రాయపడ్డారు. ఆ విధంగా చేస్తేనే పూర్తి న్యాయభావన సార్థకమవుతుందని కూడా చంద్రచూడ్‌ 2018సెప్టెంబరులో ఇచ్చిన తీర్పులో నిర్దేశించారు,ఆ కేసులో ఆయనకు అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన కె.కె.వేణుగోపాల్‌ ఇప్పుడు అటార్నీ జనరల్‌గావున్నారు.అయితే తర్వాత దాన్ని అమలులోకి  తేలేదు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ పద్దతి వచ్చిన కారణంగా ఇప్పుడు ఈచర్చ బలంపుంజుకుంది. డిజిటైజేషన్‌ అమలుకు  కూడా చంద్రచూడ్‌ బాధ్యత తీసుకోవడంతో ప్రత్యక్ష ప్రసారం విషయంలో ఆయారాష్ట్రాల హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని వాటికి స్వేచ్చ నిచ్చి వదిలేశారు, ఆప్రకారమే గుజరాత్‌ హైకోర్టు ప్రత్యక్ష ప్రసారం మొదలుపెట్టిన నేపథ్యంలోనే  సుప్రీంకోర్టు మళ్లీచేపట్టింది. ఈ బెంచిలో సిజెఐతో పాటు చంద్రచూడ్‌ వుండటంమరోవిశేషం.జస్టిస్‌ లావునాగేశ్వరరావుధర్మాసనంలో మరో సభ్యులు.
            సిజెఐ బాబ్డే తన వ్యాఖ్యానం చెబుతూ ప్రత్యక్ష ప్రసార పద్దతిలో కొన్ని చిక్కు వున్నాయని దాన్ని డుర్వినియోగపర్చే అవకాశం వుందని అన్నారు. వాటిని బహిరంగంగా చర్చించడం  సాధ్యం కాదన్నారు. అయితే మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే.లేకపోతే మా తర్వాత వచ్చే వారు (అంటూ జస్టిస్‌ చంద్రచూడ్‌ కేసి చూశారట) తీసుకోవలసి వుంటుంది అన్నారు.బాబ్డేవచ్చే ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎపి ముఖ్యమంత్రి జగన్‌ లేఖతో ఆయన తదుపరి ఫ్రధాన న్యాయమూర్తి ఎంపిక చర్చనీయమైంది. ప్రస్తుత సీనియారిటీ ప్రకారం చంద్రచూడ్‌ సమీపంలో లేకున్నా బాబ్డే  ఈ వ్యాఖ్య చేయడం అందుకే ఆసక్తి రేపింది.కెకెవేణుగోపాల్‌  మాట్లాడుతూ కరోనా ఈ సమస్యను మరోసారి సమీక్షించేందుకు అవకాశమిచ్చిందని అన్నారు. రాజకీయ నేతలపై కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ామాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ మధ్యనే బాబ్డేకు లేఖ రాశారు కూడా. ఈ రోజు సిజెఐ మాటలను బట్టి చూస్తే ఈ అంశం  ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విచారణ ప్రక్రియ  ప్రత్యక్ష ప్రసారంలో  సమస్యలు  కూడా ఈ మధ్య కొన్ని బయిటపడ్డాయి. ఒక న్యాయవాది చొక్కా లేకుండా కనిపించడంతో హైకోర్టు పదివేలు  జరిమానా వేసింది. సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్తగి సిగరెట్‌కాలుస్తూ కనిపించడంపై మందలించింది. అయితే సిజెఐ మాటలను బట్టి చూస్తే ఇంతకంటే తీవ్రమైన అభ్యంతరాలు వున్నట్టు కనిపిస్తుంది.